telugu navyamedia
సినిమా వార్తలు

“అర్జున్ రెడ్డి” కన్నడ రీమేక్ కు సన్నాహాలు

Arjun-Reddy

టాలీవుడ్లో చిన్న సినిమాగా రూపొందిన “అర్జున్ రెడ్డి” అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ దేవరకొండను స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. సందీప్ వంగా దర్శకత్వం ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా “కబీర్ సింగ్” టైటిల్ తో తెరకెక్కించారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. విదేశాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబడుతోందని విశ్లేషకులు వెల్లడించారు. త‌మిళంలో “ఆదిత్య వ‌ర్మ” పేరుతో రీమేక్ అవుతోంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రాన్ని క‌న్న‌డ‌లోను రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ ఎస్‌.నారాయ‌ణ్ రీసెంట్‌గా అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ ద‌క్కించుకోగా అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌. ఈ రీమేక్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Related posts