telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి విషయంలో మలైకా, అర్జున్ ల మధ్య విబేధాలు ?

Arjun-Kapoor-and-Malaika-Arora-Khan

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మలైకా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా… మలైకా ఘాటుగా స్పందించింది. ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఫిక్సైపోయారు ఈ జోడీ. ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఆ మూడు ముళ్ళ విషయంలో మాత్రం ఇంకా టైమ్ ఉందంటున్నాడు అర్జున్ కపూర్. కలిసి తిరగడానికి తానేం సిగ్గుపడటం లేదని.. పైగా రిలేషన్ షిప్ కూడా దాచాలని అనుకోవడం లేదని చెబుతున్నాడు అర్జున్ కపూర్. రిలేషన్ దాచుకోని వాన్ని పెళ్లి విషయం మాత్రం ఎందుకు దాచుకుంటానని ప్రశ్నిస్తున్నాడు ఈయన. తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు ఈయన. మరోవైపు మలైకా అరోరా కూడా పెళ్లి గురించి నేరుగా తనకు ఇష్టం లేదని చెప్పేసింది. పెళ్లి విషయంలో తనను అడగొద్దని.. తాను పెళ్లి చేసుకోనని చెప్పింది మలైకా అరోరా. దాంతో అర్జున్ కపూర్ కాస్త ఫీల్ అయ్యాడని చెబుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. పెళ్ళి గురించి అంత ఓపెన్‌గా నో అని చెప్పడం అర్జున్ కపూర్‌కు అస్సలు నచ్చలేదని, కనీసం ఇప్పుడు అప్పుడు అని చెప్పాలి కానీ తాను చేసుకోనంటే ఎలా అని మలైకాతో అర్జున్ వివాదానికి దిగాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రెండు కుటుంబాలు కూడా సైలెంట్ కావడం మరో విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే మలైకా కొడుకు త్వరలోనే హీరోగా లాంఛ్ కాబోతున్నాడని తెలుస్తుంది.

Related posts