telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి, విడాకులు… తనవల్ల కాదంటున్న మలైకా…!

Arjun-Kapoor

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మలైకా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా… మలైకా ఘాటుగా స్పందించింది. ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఫిక్సైపోయారు ఈ జోడీ. ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఆ మూడు ముళ్ళ విషయంలో మాత్రం ఇంకా టైమ్ ఉందంటున్నాడు అర్జున్ కపూర్. కలిసి తిరగడానికి తానేం సిగ్గుపడటం లేదని.. పైగా రిలేషన్ షిప్ కూడా దాచాలని అనుకోవడం లేదని చెబుతున్నాడు అర్జున్ కపూర్. రేపో మాపో మలైకా, అర్జున్‌ కపూర్‌లు పెళ్ళాడతారని అందరూ అనుకుంటుంటే.. వాటికి మలైకా తెర దించేసింది. తనకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేస్తోంది. రిలేషన్‌షిప్‌లో ఉంటుందట కానీ, పెళ్ళి మాత్రం చేసుకోదట! పెళ్ళి, ఆ తరువాత విడాకుల కోసం గొడవలు పడడం తన వల్ల కాదట. రిలేషన్‌ షిప్‌ అయితే ఈ గొడవలన్నీ ఉండవనీ, ఎవరికిష్టం లేకపోతే వాళ్ళు ఫ్రెండ్లీగా విడిపోవడం హాయిగా ఉంటుంది కదా అంటూ లాజిక్‌లు మాట్లాడుతోందట మలైకా.

Related posts