telugu navyamedia
రాజకీయ

జయప్రదను ఓడించడానికి అన్ని పక్షాలు ఏకమయ్యాయా ?

Political parties,Jayaprada
రాంపూర్ లోక్ సభ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు ?
జయప్రదా ?
ఆజాం ఖానా ?
ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జయప్రద , సమాజవాది పార్టీ, బహు జన సమాజవాది పార్టీ , రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ సంయుక్తంగా ఆజాం ఖాన్ ను నిలబెట్టాయి . ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లో 80 పార్లమెంట్ నియోజక వార్గాలున్నాయి . వీటిలో బహుజన సమాజావాది పార్టీ 38, సమాజవాది పార్టీ 37, రాష్ట్రీయ లోకదళ్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి . 
కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ , సోనియా పోటీచేస్తున్న అమేథి , రాయిబరేలి నియోజక వర్గాల్లో ఈ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు . అందుకు ప్రతిగా రాంపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ సంజయ్ కపూర్ అనే హిందును నిలబెట్టింది . రాంపూర్ లో మొత్తం 9,56,89 ఓటర్లు వున్నారు . వీరిలో 53 శాతం ముస్లింలు , 47 శాతం హిందువులు . ఇక్కడ హిందూ ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ హిందూ అభ్యర్థిని పోటీలో ఉంచింది . అంటే ముస్లింల ఓట్లు ఆజాం ఖాన్ కు పడే అవకాశం వుంది . 
Political parties,Jayaprada
2014లో భారతీయ జనతా పార్టీ డాక్టర్ నేపాల్ సింగ్ ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది . కాంగ్రెస్ పార్టీ నవాబ్ ఖాసిమ్ ఖాన్ , ఎస్పీ తరుపున నసీర్ అహ్మద్ ఖాన్ , బీఎస్పీ తరుపున అక్బర్ హుసేన్ , ఏ ఐ ఎమ్ ఎఫ్ పార్టీ తరుపున జన్నత్ నిషా నిలబడ్డారు . డాక్టర్ నేపాల్   సింగ్ ఒక్కడే హిందూ అభ్యర్థి కాబట్టి 23, 435 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు . 
కానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదు . ఒక్కడే ముస్లిం అభ్యర్థి వున్నాడు . ఇద్దరు హిందూ అభ్యర్థులు బరిలో వున్నారు . 
జయప్రద , సంజయ్ కపూర్ హిందూ ఓట్లు పంచుకునే అవకాశం వుంది . ఆజాం ఖాన్ ఒక్కడే కనుక అతనికి ముస్లిం ఓట్లు మొత్తం పడే అవకాశం వుంది . ఆజాం ఖాన్ సమాజావాది పార్టీలో సీనియర్ నాయకుడు . పైగా స్థానికుడు . 2004, 2009లో  ఇదే నియోజక వర్గం నుంచి రెండు సార్లు సమాజావాది పార్టీ తరుపున జయప్రద పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది . ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ , గ్లామర్ కూడా తగ్గిన నేపథ్యంలో జయప్రద గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రచారం హోరా హోరీగా జరుగుతుంది . ఆజాం ఖాన్ ను జయప్రద అల్లావుద్దీన్ ఖిల్జీ తో పోల్చితే , జయప్రదను ఖాకీ నిక్కరు వేసుకున్న జయప్రద అని ఆజాం ఖాన్ ఎద్దేవా చేశాడు . దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు . 
ఒకప్పుడు ఆజాం ఖాన్ , జయప్రద ఒకే పార్టీలో వున్నారు , సన్నిహితులు కూడా . ఇప్పుడు బద్ద శత్రువులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు . ఈనెల 23న ఇక్కడ పోలింగ్ జరుగుతుంది . అందరి ద్రుష్టి రాంపూర్ మీదనే వుంది . 
-భగీరథ 

Related posts