• Home
  • Trending Today
  • ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్
Trending Today సినిమా వార్తలు

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్

aravinda sametha

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అరవింద సమేత’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. నిన్ననే ఈ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక అమెరికాలో అయితే “అరవింద సమేత” కలెక్షన్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. యూఎస్ లో ఇప్పటికే సినిమా 1 మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేసింది. తాజాగా ఈ చిత్రం సాధించిన మొదటి రోజు కలెక్షన్లు వచ్చేశాయి. మొత్తంగా మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అరవింద సమేత 25 కోట్ల షేర్స్ ను సాధించింది. ఇక కర్ణాటకలో రూ.5.26 కోట్ల వరకు షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అరవింద సమేత శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ తెలుగు చానెల్ 23.50కోట్లకు పోటీపడి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లోనే శాటిలైట్స్ హక్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఈ వీకెండ్ లో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

Related posts

కౌశల్ ఆర్మీ కి అన్ని ఓట్లు ఎలా వచ్చాయో తెలుసా..? బయటకొచ్చిన చాలా నిజాలు

jithu j

"సిక్స్త్ సెన్స్" టీజర్

admin

విజయ్ దేవరకొండకు నిఖిల్ పంచ్… మరి విజయ్ అభిమానులు ఏం చేశారో చూడండి

vimala t

Leave a Comment