• Home
  • Trending Today
  • “అరవింద సమేత వీర రాఘవ” మా వ్యూ
Trending Today రివ్యూలు సమీక్ష వార్తలు సినిమా వార్తలు

“అరవింద సమేత వీర రాఘవ” మా వ్యూ

aravinda-sametha

బ్యానర్ : హారిక అండ్ హాసినీ క్రియేషన్స్
నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్ చంద్ర, రావూ రమేష్ తదితరులు
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం : తమన్
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ అనగానే అందరి దృష్టి “అరవింద సమేత”పై పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ లతో ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. కానీ త్రివిక్రమ్ తీసిన “అజ్ఞాతవాసి” చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో అభిమానుల్లో కొంత ఆందోళన కూడా నెలకొంది. మరోవైపు ఎన్టీఆర్ విభిన్న చిత్రాల్లో నటిస్తూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇక నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “అరవింద సమేత” ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా ? త్రివిక్రమ్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడా… చూద్దాం…!

కథ :
నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు ఊర్లు… నల్లగుడి ఊరి పెద్ద బాసి రెడ్డి (జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య శత్రుత్వం మొదలవుతుంది. ఒకరినొకరు చంపుకునేదాకా వీరి మధ్య వైరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) లండన్ నుంచి ఊరికి వస్తాడు. నారప రెడ్డి కొడుకును ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఆ సమయంలో నారప రెడ్డిపై దాడి చేసి చంపేస్తాడు ఓబా. ఈ సంఘటనతో షాక్ కు గురైన వీర రాఘవ ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ లవ్ లో ఉండగా అరవిందకు ఓ ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి అరవిందను వీర రాఘవ కాపాడతాడు. మరి అరవిందకు ఎదురైన ప్రమాదం ఏంటి ? ఆ రెండూళ్ల మధ్య సమస్యను వీర రాఘవ ఎలా పరిష్కరించాడు ? ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా ప్రతీ సన్నివేశంలో ఎన్టీఆర్ నటన అద్భుతం. అంతేకాదు రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్, ఎన్టీఆర్ లుక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. హీరోయిన్ పూజా హెగ్డే అరవిందగా ఆమె పాత్రలో నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో, గ్లామర్ పరంగానూ ఆమె బాగా ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో జగపతి బాబు జీవించాడని చెప్పొచ్చు. ఇక యంగ్ హీరో నవీన చంద్ర నటనతో ఆకట్టుకున్నాడు. సునీల్ తనదైన టైమింగ్ తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. రావూ రమేష్, దేవయాని, సుప్రియా పాతక్, ఈషా రెబ్బా తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
రొటీన్ కథను తీసుకున్న త్రివిక్రమ్ అభిమానులు నిరాశ చెందకుండా తన నుంచి అభిమానులు ఆశించే డైలాగులు, ఎమోషన్, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్ ను అభిమానులు ఆశించిన స్థాయిలో చూపించడంలో విజయం సాధించాడు. అయితే త్రివిక్రమ్ గత చిత్రాలకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు… కానీ తరువాత కథనం, ముఖ్యంగా లవ్ స్టోరి సాగదీసినట్టుగా ఉంటుంది. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది. ద్వితీయార్థం ఎమోషనల్ సన్నివేశాలతో, ప్రీ క్లైమాక్స్ బాగుంది. తమన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్ మారిపోయింది. పీఎస్ విందా సినిమాటోగ్రపితో రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు. ఇది సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. .

రేటింగ్ : 3/5

నా 14ఏళ్ల వయసులో ఒంటిపై బట్టలు తీయమని అడిగారు…

అమెరికా ప్రముఖ మోడల్, అందాలభామ సారాజిఫ్ సంచలన ప్రకటన చేశారు. తాను 14ఏళ్ల వయసులో ఉండగా ఫోటో సెషన్ కోసం వెళితే తన ఒంటిపై ఉన్న బట్టలు తీయమని ఫోటోగ్రాఫర్లు అడిగారని 35 ఏళ్ల మోడల్ సారాజిఫ్ వెల్లడించారు. ప్రస్థుతం సారాజిఫ్ న్యూయార్క్ నగరంలో మోడల్ గా పలు షోలు నిర్వహిస్తూ వాణిజ్యప్రకటనల్లో నటిస్తోంది. తాను చిన్నతనంలో లైంగికవేధింపులు ఎదుర్కొన్నానని సారా వెల్లడించింది.

sara ziff

14 ఏళ్ల వయసులో ఉండగా ఫోటో షూట్ కోసం తాను తల్లిదండ్రులేకుండా ఒంటరిగా ఫోటోగ్రాఫర్స్ అపార్టుమెంటుకు వెళ్లితే అక్కడ ఒక ఫోటోగ్రాఫరు తన ఒంటిపై దుస్తులన్నీ తొలగించాలని కోరినట్లు సారా వెల్లడించారు. ఆ సమయంలో తాను కేవలం మిక్కీమౌస్ అండర్వేర్, స్పోర్టు బ్రా ధరించి ఉండగా, వాటిని కూడా తొలగించాలని ఫోటోగ్రాఫరు కోరాడని సారా తెలిపింది. ఫోటోషూట్ సమయంలో డ్రగ్స్ ఉచితంగా ఇచ్చారని, వాటిని తీసుకొని మంచి ఫోజులు ఇవ్వాలని కోరారని సారా పేర్కొంది. మోడల్స్ భద్రత, రక్షణ కోసం తాను 2012లో ‘మోడల్ అలియన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని ఫ్యాషన్ పరిశ్రమలో లైంగికవేధింపుల నివారణకు ఈ సంస్థ పాటుపడుతుందని సారాజిఫ్ వివరించారు.

Related posts

"కృష్ణార్జునయుద్ధం" ప్రివ్యూ

admin

స్వీపర్ స్థాయి వారికే..లక్షలలో జీతాలు ఇస్తున్న…ఏపీ ప్రభుత్వం…

chandra sekkhar

'రంగస్థల' సంబరాలలో మెగా కుటుంబం…

admin

Leave a Comment