• Home
  • Trending Today
  • “అరవింద సమేత” మొదటివారం కలెక్షన్లు
Trending Today సినిమా వార్తలు

“అరవింద సమేత” మొదటివారం కలెక్షన్లు

Aravinda Sametha

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “అరవింద సమేత” చిత్రం ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లతో విజయవంతంగా దూసుకెళ్లింది. తారక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా ఏడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.77.31 కోట్ల షేర్ ని వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడురోజులకి రూ.52కోట్ల 66 లక్షలు వసూలు చేసింది. ఆంధ్ర, తెలంగాణాలలో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల మార్కెట్ 70 కోట్లకు పైగా జరిగింది. ఈ వారంలో ‘హలో గురు ప్రేమకోసమే, పందెంకోడి2’ సినిమాలు విడుదల కావడంతో కలెక్షన్స్ పరంగా “అరవింద సమేత”ని కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. అయితే మెయిన్ థియేటర్లలో ఇంకా సినిమాను తీయలేదు కాబట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్
నైజాం – 15,80 కోట్లు
సీడెడ్ – 10.10 కోట్లు
ఉత్తారాంధ్ర – 5.95 కోట్లు
ఈస్ట్ – 4.65 కోట్లు
వెస్ట్ – 3.65 కోట్లు
కృష్ణ – 3.60 కోట్లు
గుంటూరు- 6.75 కోట్లు
నెల్లూరు – 2.16 కోట్లు

Related posts

బాహుబలి తరహాలో సాహో… హాస్య నటుడు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర

nagaraj chanti

కేసీఆర్ ను పొగిడిన జేడీ లక్ష్మీ నారాయణ…!

nagaraj chanti

పువ్వు బొమ్మతో బికినీ… అందాలు ఆరబోస్తున్న మెగా హీరోయిన్

nagaraj chanti

Leave a Comment