• Home
  • Trending Today
  • “అరవింద సమేత” కలెక్షన్లు డల్… నష్టాలు తప్పవా ?
Trending Today సినిమా వార్తలు

“అరవింద సమేత” కలెక్షన్లు డల్… నష్టాలు తప్పవా ?

Aravinda Sametha

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “అరవింద సమేత” చిత్రం ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లతో విజయవంతంగా దూసుకెళ్లింది. తారక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. అయితే ఊహించని విధంగా మొదటివారం తరువాత అంటే సోమవారం నుంచి కలెక్షన్లు డల్ అయినట్లుగా తెలుస్తోంది. అరవింద రిలీజై ఆరు రోజులవుతోంది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.3.55 కోట్లు అందుకోగా మంగళవారం అంతకంటే తక్కువగా 2.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రం 90కోట్ల థ్రియేటికల్ రైట్స్ కు అమ్ముడుపోయింది. ఆ స్థాయి వరకు షేర్స్ అందుకోవాలి అంటే కలెక్షన్స్ నెంబర్స్ పెరగాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ఆరు రోజుల్లో రూ.55.52 కోట్ల వసూళ్లు సాధించింది.

మరోవైపు ఓవర్సీస్ లో ‘అరవింద సమేత’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. బయ్యర్లు ఎక్కువ మొత్తం చెల్లించి ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్నారు. సినిమాకు కనీసం మూడు మిలియన్ల డాలర్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఒక మిలియన్ ని మాత్రమే రాబట్టింది. లాంగ్ రన్ లో మరో రెండు మిలియన్ల డాలర్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సినిమాపై భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా లేవు.

దసరా సెలవులకు కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని అనుకున్నా… మరో రెండు సినిమాలు పోటీకి దిగనున్నాయి. విశాల్ మాస్ ఎంటర్టైనర్ పందెం కోడి-2, రామ్ కామెడీ అండ్ లవ్ ఎంటరైనర్ హలో గురు ప్రేమ కోసమే గురువారం రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాలకు కొంచెం పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకుల దృష్టి అటువైపు మరలే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో “అరవింద సమేత” కలెక్షన్స్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

Related posts

ఏప్రిల్ 1న సుమంత్ 25వ చిత్రం టైటిల్

admin

నేడూ… తగ్గిన పెట్రోల్ ధరలు..

chandra sekkhar

“అరవింద సమేత”… ఒకటీ, రెండూ కాదు… మొత్తం ఒకేసారి…

vimala t

Leave a Comment