• Home
  • వార్తలు
  • వారు చెప్పడం వల్లే ‘అరవింద సమేత’ క్లైమాక్స్ మారింది
వార్తలు సినిమా వార్తలు

వారు చెప్పడం వల్లే ‘అరవింద సమేత’ క్లైమాక్స్ మారింది

aravinda-sametha

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తారక్ ‘అరవింద సమేత వీర రాఘవ’ దసరా కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఇటు తారక్, అటు త్రివిక్రమ్ అభిమానులని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన చిత్రంగా కితాబు అందుకుంటోంది. దీంతోపాటు థమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందని రివ్యూలు చెబుతున్నాయి.

సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం గురువారం సాయంత్రం చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అసలు అరవింద సమేత క్లైమాక్స్ కోసం ముందుగా ఓ యాక్షన్ సీన్ అనుకొన్నారంట. ఐతే, క్లైమాక్స్ లో యాక్షన్ ఏపీసోడ్ వద్దని ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ చెప్పడంతో.. యుద్ధం తరువాత కథ చెప్పారట. ఇదో ప్రయోగం. ఆ ప్రయోగం ప్రేక్షకులకి నచ్చిందని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.




త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తా : ధనుష్ హీరోయిన్
amira

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.. తాజాగా మరి మరో బాలీవుడ్‌ నటి అమిరాదస్తూరి స్పందిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై విరుచుకుపడంది. తమిళంలో ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె లైంగిక బాధితుల వరుసలో తాను ఉన్నానని చెప్పింది. దక్షిణాదికి చెందిన ఆ వ్యక్తి అన్ని విధాలుగా బలమైన వాడు. అయితే త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తాను అని పేర్కొంది.

Related posts

కలవరమాయె! (కంద పద్యం)

chandra sekkhar

భారత సైనికులకు శుభవార్త… వైరల్ గా మారిన వివాదం

vimala t

అనూషా రాయ్ ‘చిత్రాలు’ …

chandra sekkhar

Leave a Comment