telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చరణ్ కు అరవింద్ స్వామి ఫోన్… “సైరా”లో అవకాశం కోసమేనా ?

Aravind-Swamy

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 15న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క‌ర్నూలులో నిర్వ‌హించ‌బోతున్నార‌ని స‌మాచారం. కాగా తమిళ స్టార్ అరవింద్ స్వామి ‘సైర నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళంలో చిరంజీవి పాత్రకు వినిపించేది అరవింద్ స్వామి గొంతే. కేవలం చిరు కనిపిస్తారంతే. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’లో అరవింద్ స్వామి ప్రతి నాయకుడిగా నటించారు. ఆ సినిమాతో పాటు సైరాకు కూడా సురేందర్ రెడ్డియే దర్శకుడు. దీంతో ఆ డైరెక్టర్‌తో కూడా అరవింద్ స్వామికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో తమిళంలో చిరంజీవికి తాను డబ్బింగ్ చెబుతానని అరవింద్ స్వామి స్వయంగా రామ్‌చరణ్‌కు ఫోన్ చేశారట. అంతే కాకుండా స్వచ్ఛమైన తమిళంలో కొన్ని డైలాగులు చెప్పి, వాయిస్ ఫైల్స్ చిరంజీవికి పంపారని తెలిసింది. ఈ విషయమై చిరంజీవితో చరణ్ మాట్లాడటం.. ఆయన ఓకే చెప్పేయడం చకచక జరిగిపోయాయి. తెలుగు తెరపైన చిరంజీవి గొంతు వినిపిస్తుంది చిరంజీవియే కనిపిస్తారు. కానీ తమిళంలో మాత్రం కనిపించేది చిరంజీవి అయితే.. వినిపించేది మాత్రం అరవింద్ స్వామి అన్నమాట. ఇక పోతే ‘సైరా నరసింహారెడ్డి’కు తమిళలంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కన్నడంలో ఓ సీనియర్ హీరో వాయిస్ ఇస్తున్నారని సమాచారం.

Related posts