• Home
  • వార్తలు
  • అరకులో మావోయిస్టుల ఘాతుకం…నిర్లక్ష్యం వల్లనే : జనసేనాని
రాజకీయ వార్తలు వార్తలు

అరకులో మావోయిస్టుల ఘాతుకం…నిర్లక్ష్యం వల్లనే : జనసేనాని

Police Notices to Pawan about Dowleswaram Walk

నిన్న అరకులో మావోయిస్టులు హతమార్చిన టీడీపీ నాయకుల ఘటన ఒక గుణపాఠం లాంటిది. అధికారం చేతులో ఉందికదా అని ప్రజల శ్రేయస్సును కాకుండా సొంత ప్రయోజనాలను చూసుకునే వారికి ప్రజలలోంచి వచ్చే కొన్ని శక్తులు ఇలా బుద్ది చెపుతుంటాయి. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ వర్గాలు కూడా. అరకులో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అక్కడ అక్రమంగా సాగిస్తున్న క్వారీ వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నది ప్రత్యక్షంగా చూశారు. ఆ క్వారీ మూలంగా ఇల్లు ధ్వంసం అవుతున్నాయి, తాగునీరు విషపూరిత్తం అయిపోయింది అని స్వయంగా అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు. ఇలాగే అధికారం చేతులో ఉంది కదా అని అక్రమంగా కర్నూల్ జిల్లాలోని హత్తి బెళగల్ గ్రామంలో ని క్వారీలో కూడా పేలుడు దాటికి 12 మంది మృతిచెందిన విషయాన్నీ గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

కాగా రొట్టెల పండగలో పాల్గొనేందులు నెల్లూరు వెళ్లిన పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రజా సేవ చేయాలి అనుకున్నవారు మాత్రమే చేరాలి అని స్పష్టం చేశారు. పండగ సందర్భంగా అక్కడి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తన చిన్నతనంలో విద్యనేర్పిన గురువులను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. తనకు తన గురువులు విలువలు నేర్పించారని చెప్పారు.

Related posts

రాజ్యసభ కోసం ఆయిద్దరి కలయిక

admin

తక్కువ ధరకే అదునాతన ఫీచర్స్ తో రియల్ మీ 2 మొబైల్…. విడుదల

nagaraj chanti

టాప్ లెస్ గా సాంగ్ పాడి సంచలనం రేపిన టెన్నిస్ సూపర్ స్టార్ విలియమ్స్…!

nagaraj chanti

Leave a Comment