telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్” కోసం ఏఆర్ రెహమాన్ సాంగ్

AR-Rehaman

సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సిరీస్ “అవెంజర్స్” నుంచి వస్తున్న లేటెస్ట్ సిరీస్ “అవెంజర్స్: ఎండ్ గేమ్”. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఉన్న అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సిరీస్ కు భారీగా అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. ఇక ఇండియాలో విడుదల కాబోయే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ చేత ఒక పాటను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ పాట విడుదల కానుంది. ఆంటోనీ, జాయ్ రుసో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts