telugu navyamedia
సినిమా వార్తలు

కమల్ హాసన్ తో మొదటిసారిగా రెహమాన్…

Kamal-and-AR

త‌మిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మొదటిసారి ఓ ప్రాజెక్ట్ కోసం క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఏఆర్ రెహ‌మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. క‌మ‌ల్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… “లెజండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌తో క‌లిసి పని చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంది” అని పేర్కొన్నాడు. అయితే వీరిద్ద‌రు క‌లిసి ఏ చిత్రం చేస్తున్నార‌నే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. క‌మ‌ల్ క‌ల‌ల ప్రాజెక్ట్ త‌లైవ‌న్ ఇరుక్కిర‌న్. ఈ చిత్రాన్ని 2015లో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. కాని మ‌ధ్య‌లో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి ఊసే లేదు. తాజాగా ఈ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో రీమేక్ చేయ‌బోతున్నాడా అని అభిమానుల‌లో సందేహం క‌లుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేన‌ల్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. క‌మ‌ల్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Related posts