telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

27లో 26 డిమాండ్లకు సానుకూలత.. ఆ ఒక్కటి తేలితే సమ్మె ఉండదు : ఆర్టీసీ సంఘాలు

apsrtc workers union on strike

నేడు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో కార్మిక సంఘాల ఐకాస నేతల చర్చలు సానుకూలంగా ముగిశాయి. కార్మికుల 26 సమస్యల్ని పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఐకాస నేతలు తెలిపారు. నాలుగు దఫాలుగా జరిగిన చర్చల్లో ఆర్థిక పరమైన అంశంపై స్పష్టమైన హామీ రావాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీఎం జగన్‌తో సమావేశమై సమస్యల్ని ఆయన ముందుంచి ఆర్థిక భరోసా వచ్చాకే సమ్మె ప్రతిపాదన విరమణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ సంఘాల ఐకాస సమన్వయకర్త దామోదర్‌ తెలిపారు.

ఆర్టీసీ విలీనంపై తొలి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు ఐకాస నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆర్థికపరమైన అంశాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సిబ్బంది కుదింపు, అద్దె బస్సుల విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గిందని.. తామిచ్చిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు సానుకూలతన లభించిందని వివరించారు. సీఎం అనుమతి కోసం వేచిచూస్తున్నామని.. ఈ రోజు సీఎంను కలిసిన తర్వాతే సమ్మె యోచన విరమణపై నిర్ణయం తీసుకుంటామని ఐకాస నేతలు వెల్లడించారు.

Related posts