telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రయాణికులకు శుభవార్త… 1500 కొత్త బస్సులు

apsrtc bus

సంక్రాంతి పండగ వచ్చింది అంటే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తుంటారు. అందువల్ల ఆర్టీసీకి ఈ సీజన్ లో అధిక ఆదాయం లభిస్తుంటుంది. ఇక తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఏపీకి వెళ్తుంటారు.  అలా ఏపీకి వెళ్లే ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.  ప్రతి ఏడాది 2వేలకు పైగా బస్సులు హైదరాబాద్ నుంచి ఏపీకి నడుస్తుండేవి.  కానీ, కరోనా కారణంగా ఈ ఏడాది బస్సుల సంఖ్యను 1500 కి తగ్గించింది.  హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసింది.  హైదరాబాద్ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు అధికంగా బస్సులు నడవనున్నాయి.  అంతేకాదు, హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసి ఏర్పాట్లు చేసింది.  కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, వెళ్లే పండగ స్పెషల్ బస్సులు గౌలిగూడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతాయి.  విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు బీహెచ్ఎంఎల్, కేపీహెచ్బీ, ఎల్బీ నగర్ నుంచి బయలుదేరుతాయి. అయితే ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మేలు జరుగుతుంది.

Related posts