telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ ఆర్టీసీ .. ప్రభుత్వంలో విలీనం.. !

apsrtc employees demand to make it govt

ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గా ఉన్నప్పటికీ నష్టాలు తప్పటం లేదు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వం తన సంస్థలకు ఇవ్వటంలేదనేది ఇక్కడే స్పష్టం అవుతుంది. దీనితో సమ్మె సైరన్ మోగుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఏపీ గవర్నమెంటుకు సమ్మె నోటీసులు ఇవ్వడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య స్పందించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులు ఆర్టీసీని నాశనం చేయాలని కోరుకుంటున్నారని, గతంలో కాంగ్రెస్ నేతలు ఆర్టీసీని జేబు సంస్థగా మార్చారని విమర్శించారు.

ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపదాలంటే రూ.1500 కోట్లు అవసరం అవుతుందని, దానికితోడు ఏటా 7.5 శాతం చార్జీల పెంపునకు అనుమతి ఇస్తే సంస్థకు నష్టాలు తప్పుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతున్నట్టు వెల్లడించారు.

Related posts