telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

అప్రెంటిస్‌షిప్‌ కొరకు ధరఖాస్తులు ఆహ్వానం

funds to telangana by central govt

వివిధ సాంకేతిక కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కొరకు ధరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ సనత్ నగర్ ఐటీఐ ప్రిన్సిపాల్‌ డి.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి సనత్‌నగర్‌ ఐటీఐ ప్రాంగణంలో రెండు రోజుల పాటు అప్రెంటిస్‌షిప్‌ జరుగనుందని తెలిపారు. నేటి నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ అప్రెంటిస్‌షిప్‌కు 5, 7,10వ తరగతులు, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, బీటెక్‌, పార్మసీ, నర్సింగ్‌ విద్యార్థులు ఆప్షనల్‌ ట్రేడ్‌లో అప్రెంటిస్‌ చేసేందుకు ఈ మూడు రోజుల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని తెలిపారు.

మరింత సమాచారం కోసం అప్రెంటిస్‌షిప్‌ ఇండియా. ఆర్గ్‌లో చూడవచ్చన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్‌ కాపీలతో సనత్‌నగర్‌ ఐటీఐలోని రిజిస్ట్రేషన్‌ కేంద్రానికి రావాలని సూచించారు. వివరాలకు ఐటీఐలో సంప్రదించాలని, సనత్‌నగర్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి పారిశ్రామికవాడలోని పరిశ్రమలు, కంపెనీలు, ఇప్పటివరకు అప్రెంటిస్‌షిప్‌ యాక్ట్‌లో చేరకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related posts