telugu navyamedia
news telugu cinema news

అర్హ పై ప్రశంసల జల్లు…

కొణిదల ఫ్యామిలీలో లేడీ ఆర్టిస్ట్ నీహారిక వుంది. కానీ.. అల్లు కుటుంబం నుంచి నటీమణులు ఎవ్వరూ రాలేదు. త్వరలో ఓ బాల నటి వెండితెరపైకి రానుంది. కొణిదల కుటుంబం నుంచి నీహారిక హీరోయిన్‌గా పరిచయమైతే.. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ బాలనటి ఎవరో తెలుసా..? బేబి షామిలి అంటే ఎవరో తెలీకపోయినా.. అంజిలి పాప అంటే ఈజీగా అర్థమవుతుంది. అంతలా ఆ పాత్ర ఆమెకు పేరు తీసుకొచ్చింది. బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు వరించింది. ఇలాంటి పాత్రను మ్యాచ్‌ చేయడం సాహసమే. ఈ ఫీట్‌ను అల్లు అర్జున్‌ కూతురు అర్హా సాధించింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ వున్న కుటుంబం కావడం.. బన్నీ షూటింగ్స్‌కు పిల్లలు వెళ్లడంతో.. ఆ వాతావరణ ప్రభావం కొడుకు అయాన్‌.. అర్హపై పడింది. ఇక కూతురైతే.. ఇన్వాల్వ్‌ అయిపోయింది. అంజలి టైటిల్‌ సాంగ్‌కు ఈ చిన్నారి పెర్‌ఫార్మెన్స్‌కు ముద్దులు.. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ నట వారసత్వాన్ని నిలబెట్టేది కూతురే అంటే.. కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. క్యూట్‌ బేబి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను తెగ మెచ్చేసుకుంటున్నారు. చూస్తుంటే అర్హ బాలనటిగా వెండితెరపైకి రావడానికి ఎంతోటైం లేదనిపిస్తోంది.

Related posts

కరోనా పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది: మంత్రి ఎర్రబెల్లి

vimala p

ఐఏఎస్ లు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు: భట్టి విక్రమార్క

vimala p

పవన్ 28వ సినిమాలో మలయాళ బ్యూటీ… స్పందించిన హరీష్ శంకర్

vimala p