telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో కొత్త ప్రొడక్ట్ ను తీసుకొస్తున్న యాపిల్… ఏంటంటే..?

టెక్నాలజీలో యాపిల్ కంపెనీ గురించి అడిగితే పురణాలలాగా మాట్లాడతారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఒకటైన యాపిల్ ఇటీవల తన కొత్త ప్రొడక్ట్స్ వివరాలను వెల్లడించింది. అయితే దాని అభిమానులకు మరింత చేరువవుతుందని సంస్థ అంటోంది. ఈ సంస్థ కేవలం మొబైల్స్‌లోనే కాకుండా కంప్యూటర్ల ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకుంది. అయితే ఈసారి ఈ సంస్థ తన కొత్త మోడల్ మ్యాక్ బుక్‌ను పరిచయం చేసింది. అందులో ఎన్ని కొ్త్త మోడల్స్ రానున్నాయని, వాటి ధర ఎంతవరకూ ఉండొచ్చని తెలిపింది. అయితే ఈ సారి సరికొత్త హార్డ్‌వేర్‌తో మూడు మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. అవి మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ మినీలుగా ప్రకటించారు. అయితే వీటిలో ఈ సంస్థ తన కొత్త సిలికాన్ ఎం1 చిప్‌ను వాడనున్నట్లు సమాచారం. అయితే మ్యాక్ బుక్ ఎయిర్ 13 అంగుళాల తెరతో టచ్ ఐడీ సౌకర్యంతో దానికి తోడుగా ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో రానుంది. దీని ధర 999 యూఎస్ డాలర్లుగా తెలిపారు. ఇక మ్యాక్ బుక్ ప్రో విషయానికొస్తే ఇదికూడా 13 అంగుళాల తెర, 8కే రిసొల్యూషన్, యాక్టివ్ కూలింగ్, 20 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్‌తో 1,299 డాలర్లకు మార్కెట్‌లో అడుగు పెట్టనుంది. మ్యాక్ మిని చూస్తే ఇందులో ఎం1 చిప్‌తో పాటు కొత్త రకం సీపీయూను వాడినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ వచ్చిన వాటికన్నా గ్రాఫిక్స్ ఆరు రెట్లు వేగంగా ఉంటుంది. చక్కటి గేమ్‌ప్లే అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ మ్యాక్ మినీ గత మోడల్ కన్నా తక్కువ ధరలో 699 డాలర్లకు లభిస్తుంది. అయితే ఈ మూడు మోడల్లు ప్రీ బుకింగ్ అవేలబిలీటీలో ఉన్నాయని, వచ్చే వారం మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Related posts