telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

యాపిల్ సరికొత్త ఐఫోన్లు..సెప్టెంబర్ 10న విడుదల!

htc smart phone u19e released

అధునాతన ఫీచర్లతో యాపిల్ సరికొత్త ఐఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించననున్న యాపిల్ ఈవెంట్‌లో ఆ సంస్థ తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు యాపిల్ ఆహ్వానాలను కూడా పంపింది. సెప్టెంబర్ 10వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని కుపర్‌టినోలో ఉన్న యాపిల్ కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఆ సంస్థ తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలోనే ఆ ఈవెంట్‌లో యాపిల్.. ఐఫోన్ 11 సిరీస్‌లో ఐఫోన్ 11, 11మ్యాక్స్/11ప్రొ, 11ఆర్ పేరిట మూడు కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్లలో వెనుక భాగంలో చతురస్రాకారంలో సెటప్ కలిగిన మూడు కెమెరా సెన్సార్లు, మల్టీ యాంగిల్ ఫేస్ ఐడీ సెన్సార్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్, ఏ13 ప్రాసెసర్ తదితర అధునాతన ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది.

Related posts