telugu navyamedia
సాంకేతిక

మీ ఫోన్లలో కొవిడ్-19 ట్రాకింగ్ సిస్టమ్…

phone

కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేసేందుకు ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో ఈ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాయి. ఈ సిస్టమ్ ద్వారా యూజర్లు ట్రాన్స్ మిషన్స్, ధ్రువీకరించిన యాప్ ద్వారా ఆరోగ్య సంస్థల నుంచి ఈజీగా డేటాను షేర్ చేయొచ్చు. వాలంటరీ కాంటాక్ట్ ట్రేసింగ్ నెట్ వర్క్ అభివృద్ధి కోసం షార్ట్ రేంజ్ బ్లూటూత్ కమ్యూనికేషన్ ఇందులో వినియోగించవచ్చు. కరోనా వ్యాప్తి డేటాను ఫోన్లపై ట్రేస్ చేయొచ్చు. పబ్లిక్ హెల్త్ అధికారుల నుంచి అధికారిక యాప్స్ నుంచి డేటాను ఈ సిస్టమ్ యాక్సస్ చేస్తుంది. కొవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తుల నివేదికను యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ సిస్టమ్ రిపోర్టు డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లకు దగ్గరలో ఎవరైన సోకిన వ్యక్తితో దగ్గరగా ఉన్నారో లేదో అలర్ట్ చేస్తోంది.

ఆపిల్, గూగుల్ కలిసి సంయుక్తంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ API సిస్టమ్ ను వచ్చే మే నెల మధ్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను ఆరోగ్య అధికారుల యాప్స్ అమలు చేయనున్నాయి. ఈ దశలో యూజర్లు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. పరిమితంగానే యాక్సస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ట్రేసింగ్ ఫంక్షనాల్టీని నిర్మించేందుకు కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లందరికి తక్షణమే ఈ ఆప్షన్ అందుబాటులో వస్తోంది. ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ద్వారా.. వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించడమే కాకుండా అతడి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చు.

Related posts