telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీకాకుళం : .. ఏపీసీఎం పర్యటన .. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ..

ys jagan cm

నేడు జిల్లాలో పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు మండలాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎం జగన్‌.. పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయిన అనంతరం 2 కిలోమీటర్ల పొడవునా కాన్వాయ్‌ గుండా సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం, రూ.600 కోట్లతో నిర్మించనున్న సమగ్ర నీటి పథకం, నువ్వలరేవు-మంచినీళ్లపేట గ్రామాల మధ్య రూ.11.95 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

ఇటీవలే మావోయిస్టుల డంప్‌ జిల్లాలో లభ్యం కావడం… ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మావోయిస్టుల ఆనవాళ్లు లభ్యం అవుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రికి జడ్‌ ప్లస్‌ భద్రత ఉంటుంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 45 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 118 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 215 మంది ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 686 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా పోలీసులు, 350 మంది హోంగార్డులు, 266 మందితో కూడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సీఎం పర్యటన ప్రారంభం నుంచి ముగిసేంతవరకు భద్రత కొనసాగిస్తారు.

Related posts