telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వారికి జీతాలు ఇవ్వద్దంటున్న .. ఏపీసీఎం బాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన జరిగిన సంగతి తెలిసిందే. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో న్యాయస్థానం తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే న్యాయపరమైన ప్రభుత్వ సంస్థలు మాత్రం ఇంకా హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ కార్యాలయం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం, ట్రైబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రోసీడింగ్స్, ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సహా పలు శాఖలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

ఏపీ రాష్ట్రానికి తరలిరాని ఈ సంస్థల్లోని ఉద్యోగులకు వేతనాలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పైన పేర్కొన్న సంస్థలతో పాటు సాధారణ పరిపాలన శాఖ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ కేడెట్ కోర్, స్టేట్ ఆర్చీవ్స్ డిపార్ట్ మెంట్, పే అండ్ అకౌంట్స్ కు జీతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.

Related posts