telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రాజధాని కోసం .. రైతుల భూములు లాక్కోవడం ఎందుకు .. : ఏపీసీఎం

apcm committee on school fee

గత ప్రభుత్వం రాజధానిపేరుమీద భూదందా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రస్తుతం సీఎం రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇష్టం లేకుండా, రాజధానికోసం అయినా భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అన్నారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు తదితర గ్రామాల్లోని ప్రజలు, తాము అధికారుల బలవంతం మీదనే భూములిచ్చామని గతంలో తనకు చెప్పారని అధికారులతో సీఆర్డీయే సమీక్షలో వ్యాఖ్యానించిన జగన్, ఏ అవసరాల కోసం ఆ భూముల్ని తీసుకోవాలనుకుంటున్నారు? అని అడిగారు.

రాజధాని నిర్మాణంపై ఏపీసీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. కేవలం ముగ్గురు ఉన్నతాధికారులు మాత్రమే సమీక్షకు హాజరు కాగా, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకూ అమరావతిలో జరిగిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జగన్‌ కు అధికారులు తెలిపారు. భూ సమీకరణలో ఎంత భూమిని తీసుకున్నారు? రైతులు ఎంతమంది భూములిచ్చారు? వారికి కేటాయించిన ప్లాట్లు ఎన్ని?, మొదలు పెట్టిన పనుల్లో 25 శాతం దాటినవి ఎన్ని? తదితర అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.

Related posts