telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇంకోసారి ఇటువంటి ఘటన .. జరగరాదు ..: ఏపీసీఎం జగన్

ys jagan cm

సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. బాధితులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బోట్లను నిలిపివేసినపుడు ప్రైవేట్ బోట్లకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారని అధికారులు ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారని సీఎం ప్రశ్నించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. నిబంధనలను అమలు చేయకుండా జీవోలకు పరిమితం చేయటం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీఎం అధికారులతో అన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించటం కొరకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. బోట్లను ఎందుకు తనిఖీ చేయట్లేదని సీఎం అధికారులను ప్రశ్నించారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సీఎం పోర్టు అధికారికి ఆదేశాలు ఇచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. బాధితుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో జలాశయాల్లో ప్రయాణించే బోట్లు, లాంచీల నిర్వహణకు కంట్రోలు రూమ్ ఏర్పాటు చేయటంతో పాటు సంబంధిత శాఖలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బోటులో జీపీఎస్, వైర్ లెస్ సెట్లు ఖచ్చితంగా ఉండాలని సీఎం అధికారులకు చెప్పారు. బాధితుల బంధువులు ప్రమాదం జరిగి రెండు రోజులవుతుందని కనీసం మృతదేహాలనైనా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ మృతదేహాలు పాడైపోతాయని బాధ పడుతూ బంధువులు రోదించినట్లు తెలుస్తుంది. బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ప్రాణాలు పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుండి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ప్రమాద స్థలానికి రెండు వైపులా ఎత్తైన కొండలు ఉండటంతో బోటును వెలికితీయడం కష్టంగా ఉందని పోర్టు, నేవీ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తుంది.

Related posts