telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ బిల్లుతో .. ముస్లింలకు అన్యాయం జరగదు.. : ఏపీసీఎం జగన్

apcm jagan Ensuring to muslims on nrc

తాజాగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం వలన ముస్లిములకు అన్యాయం జరిగితే ముందుండి పోరాడుతానని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాషా పేర్కొన్నారు. ఎన్‌.ఆర్‌.సీ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ముస్లిం ఎమ్మెల్యేలతో కలిసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎంను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై జగన్‌కు ఓ నివేది అందించారు. అనంతరం ఆంజాద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, కులమతాలకతీతంగా అన్ని వర్గాలను కలుపుకుపోతున్నామని సిఎం చెప్పినట్లు పేర్కొన్నారు. వైసిపి ముస్లిముల పక్షంగా నిలుస్తుందని, ముస్లిం, మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అనేక పథకాల ప్రవేశపెట్టిందని అన్నారు.

రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎపిలో నాలుగు శాతం రిజర్వేషన్‌లు, ఉపకార వేతనాలు, స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన బాటలోనే బడుగు, బలహీన వర్గాల కోసం రాష్ట్రంలో అన్ని పథకాలు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ జీవోను విడుదల చేశారని తెలిపారు. హజ్‌, జేరులేశం యాత్రలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పెంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వల్ల రాష్ట్రంలోని ముస్లిములు భయపడాల్సి అవసరం లేదని, ఒకవేళ ఇబ్బందులు కలిగితే పోరాడేందుకు జగన్ నేతృత్వంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టిడిపి హయాంలో నంద్యాలలో హామీలు అమలు చేయాలని ముస్లిం యువకులు ప్లకార్డులు చూపితే వారిపై దేశద్రోహం కేసులు పెట్టించారని విమర్శించారు. ఆ కేసులను వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తేశామని తెలిపారు. ముస్లింలకు వైసిపి అండగా నిలుస్తుందని, పోరాడేందుకు తాను ముందుంటానని ఆంజాద్‌భాషా అన్నారు. సిఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ముస్తఫా, నవాజ్‌ భాషా, హఫీజ్‌ ఖాన్‌, వైసిపి నాయకులు రెహమాన్‌, అబ్దుల్‌ ఖాదర్‌ ఉన్నారు.

Related posts