telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మాపై దాడులే.. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఆ ..! : చంద్రబాబు

Chandrababu fire to CM KCR

ఏపీసీఎం చంద్రబాబు కేసీఆర్ పై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఎలక్షన్‌ మిషన్‌ పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టిడిపి యాప్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై దాడి దుర్మార్గ చర్య అని, ఈ దాడులను ఖండిస్తున్నానన్నారు. ఆస్తి ఏపీ లో ఉంటే.. చోరీ కేసు తెలంగాణలో పెడతారా.., ఏపీ లో టిడిపి కోసం పని చేసే వారిపై తెలంగాణలో కేసులా..అని ప్రశ్నించారు.

ఇదేనా కెసిఆర్‌ ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిఫ్ట్‌ లు, రిటన్‌ గిఫ్ట్‌ లు ప్రతీకారంతో ఇస్తారా.. ఇలాంటి రిటన్‌ గిఫ్ట్‌ లు ఎన్నైనా తీసుకుంటామని మండిపడ్డారు. తమ డేటా దొంగిలించి ప్రత్యర్ధులకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఫ్రస్టేషన్‌ తోనే తెలంగాణలో టిడిపి పై కేసులు పెట్టిస్తున్నారని, ఏపీలో కేసులు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ప్రజా ప్రతినిధులు, బూత్‌ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

నగరంలోని మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటి గ్రిడ్‌ కంపెనీపై పోలీసులు నేడు మరో కేసును కూడా నమోదు చేశారు. సేవ మిత్ర యాప్‌ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను చోరీ చేశారంటూ.. రాంరెడ్డి అనే వైసిపి నేత ఐటి గ్రిడ్‌ కంపెనీలపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని రాంరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ఐటి గ్రిడ్‌పై విచారణ చేపట్టారు.

Related posts