telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విద్యా శాఖలోనూ .. మార్పులకు శ్రీకారం..

apcm eye on education system

ఏపీ విద్యా శాఖలో మార్పులకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. తన పాలనలో విద్యావ్యవస్థ ఆదర్శంగా ఉండేలా చూస్తానని చెప్పిన జగన్ పాఠశాలలు, వాటి మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ విద్యా శాఖలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టనున్నారు అని ఏపీ విద్యాశాఖామంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల నిర్వహణలో చోటు చేసుకునే లోపాల వల్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని విద్యాశాఖలోనూ అమలు చేయాలని భావిస్తున్నారని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

రివర్స్ టెండరింగ్ తో ఖర్చు తగ్గిస్తామని, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా కాపాడుతామని మంత్రి సురేష్ చెబుతున్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ నిధుల్ని దోచుకుందన్న ఆరోపణ చేసిన మంత్రి సురేష్ ఇప్పటివరకూ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ మీద ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇక నుండి విద్యలోనూ రివర్స్ టెండరింగ్ తో విలువైన ప్రజాధనాన్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యా శాఖలో కూడా త్వరలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొస్తామని మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో కూడా ఆయన పేర్కొన్నారు. అంతే కాదుప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో నెలలో ఒకటి, మూడు శనివారాల్లో నో బ్యాగ్‌ డే పాటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Related posts