telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

బాక్సైట్ తవ్వకాల … జీవోను రద్దు.. ఏపీసీఎం

apcm department wise meeting today

ఏపీసీఎం గా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో పారదర్శకత కోసం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. మద్యపాన నిషేధం, అవినీతి, గ్రామ సచివాలయాలు… అదే కోవలో.. ప్రభుత్వ పథకాల అమలు, పాలనలో ఎలాంటి విధానాలు అవలంభించాలో దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంపైనా దృష్టిసారించారు. ఇందులోభాగంగా నేడు ప్రజావేదికలో ఐపీఎస్ అధికారులతో జరిగిన సదస్సులో సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

గిరిజనుల జీవనానికి ఆటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. గిరిజనులు వద్దన్నప్పుడు తవ్వకాలు చేయడంలో అర్థం లేదన్నారు. బాక్సైట్ మైనింగ్ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి శాంతి, ప్రశాంతత ముఖ్యం అని గుర్తించుకోవాలని అధికారులకు సూచించారు. గిరజనులు మావోయిస్టులుగా మారకుండా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి అవసరమైన తిండి, గుడ్డ, నీరు, మరియయు ఇల్లు వంటి సదుపాయాలను సమకూర్చే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts