రాజకీయ వార్తలు వార్తలు

పర్యటనలో కూడా పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న చంద్రబాబు…

titali effect on chandrababu

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ వ్యాపారవేత్తలతో సమావేశం అవుతున్నారు. వారికి ఏపీ గురించి వివరించి పెట్టుబడులను పెట్టాలని కోరుతున్నారు. ఏపీలో ఉన్న అనేక అవకాశాలు ముఖ్యంగా పర్యాటక రంగం, ఆతిధ్య రంగాలలో పెట్టుబడులు పెట్టాలని బాబు వారిని కోరారు.

దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థలలో ఒకటైన భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అమెరికాలోనే ఉండటంతో వారితో కూడా భేటీ అయిన చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీ భాగస్వామ్యంతో భారతి గ్లోబల్ ఇప్పటికే వివిధ దేశాలలో ఆతిధ్య రంగాలలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలోనూ పెట్టాలని ఆసక్తి చూపుతున్న తరుణంలో బాబుతో భేటీ మరో అడుగు ముందుకు తీసుకెళ్ళినట్టే. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటులో మరో సంస్థ ద్రుష్టి సారించినట్టు తెలుస్తుంది. కాగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు బాబును అమెరికా ఆహ్వానించడంతో ఈ పర్యటన చోటుచేసుకుంది. 

Related posts

రాహుల్ 'జన ఆశీర్వాద్ యాత్ర'…

admin

ఇలాంటి దర్శకుడిని ఎక్కడా చూడలేదు.. సంచలంగా మారిన

nagaraj chanti

హుస్నాబాద్ నుండి…ఎన్నికల ప్రచారంలో కేసీఆర్…

chandra sekkhar

Leave a Comment