telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీలో గ్రామ వాలంటీర్ ల నియామక.. నోటిఫికేషన్ విడుదల..

ap village volunteer notification released

ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ హమీకి సంబంధించి తొలి అడుగు ముందుకు వేశారు.

గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు.

Related posts