telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పది పరీక్షల నిర్వహణపై ఏపీ మంత్రి క్లారిటీ

suresh adimulapu minister

ఏపీలో పదవ తరగతి నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాతే టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టెన్త్‌ పరీక్షలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే టెన్త్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ముందుగా షెడ్యూల్ విడుదల చేసి ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షలకు 2500 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతీ విషయాన్ని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు.

Related posts