telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల..

*టెన్త్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌..
*ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన మంత్రి బొత్స‌..

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. 

ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జులై 6న ఫలితాలను విడుదల చేశారు. నెలరోజుల్లోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు

గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ద్వారా మరోసారి ఎగ్జామ్ రాసే అవకాశం లభించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు..

 

Related posts