telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెలపై దాడి కేసులో 35 మందిపై కేసు నమోదు

AP Assembly sessions January 30 Speaker Kodela

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై గుంటూరు జిల్లా  ఇనుమట్ల గ్రామంలో మొన్నటి పోలింగ్‌ రోజున దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆ గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి ఈ ఘటనలో 35 మందిపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి తెలిపారు. అలాగే కోడెలపై దాడికి ప్రోత్సహించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, రాజ నారాయణపైనా కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టంచేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related posts