telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు

OU students wrote letter to EC

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఈవీఎంలు మొరాయించినప్పటికీ రాత్రి పూట కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,13,33,631 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,759 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేయడం విశేషం.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం:

శ్రీకాకుళం – 75.14
విజయనగరం – 80.68
విశాఖపట్నం – 71.81
తూర్పుగోదావరి – 80.08
పశ్చిమగోదావరి – 82.19
కృష్ణా – 81.12
గుంటూరు – 82.37
ప్రకాశం – 85.93
నెల్లూరు – 76.68
కడప – 77.21
కర్నూలు – 77.68
అనంతపురం – 81.90
చిత్తూరు – 81.03

Related posts