telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసులకు వీక్లీ ఆఫ్.. అధ్యయనం కోసం కమిటీ: జగన్

jagan pa nageshwar

ఏపీ పోలీసులకు వారానికి ఓరోజు సెలవు ఇచ్చే విషయమై సీఎం జగన్ అధికారులతో కమిటీని నియమించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులకు వారానికి ఓరోజు సెలవు ఇస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు.

ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అనంతరం వీక్లీ ఆఫ్ పై అధ్యయనం కోసం ముఖ్యమంత్రి ఓ కమిటీని నియమించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యంగార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

Related posts