telugu navyamedia
andhra news political trending

ఏపీ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా…126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా…పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా… 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేసారు అధికారులు. మిగిలిన 7 వేల 220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18 వేల 782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 7 వేల 735 పరిషత్ స్థానాలకు ఉదయం 7గంటల నుంచి …సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 27 వేల 751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. వీటిలో 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు కాగా….అతి సున్నితమైనవి 6వేల 314 కేంద్రాలు ఉన్నాయి. 247 స్టేషన్లను నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి.

Related posts

షూటింగ్ కు రెడీ అవుతున్న సూపర్ స్టార్ ?

vimala p

ఈ వారం టీవీ ఛానెళ్ల రేటింగులు…

vimala p

అక్కడ మళ్ళీ తెరుచుకున్న కాలేజీలు…

Vasishta Reddy