telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర సరిహద్దులో ఉన్నవారికి వసతి: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అక్కడే ఉండిపోవాలని ఏపీ మంత్రి ఆళ్ల నాని సూచించారు. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్నవారికి కల్యాణమండపాలు, హోటళ్లను పూర్తిగా శానిటైజ్‌ చేసి వసతి కల్పిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 13మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 37కేసుల నివేదికలు రావాల్సి ఉందని, ఏపీకి ఇప్పటివరకు 29,264మంది విదేశాల నుంచి వచ్చారని వెల్లడించారు. 29,115మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, 149 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్వారంటైన్‌ కోసం 23,479 బెడ్లు సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు.

Related posts