telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘టీటీడీ’ నిర్ణయంపై హైకోర్టు సీరియస్..

టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు బుధవారం ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల జంబో పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 31 మంది సభ్యులతోపాటు.. మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.

ఇక టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బోర్డు సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్లు వాదనలు వాదనలు జరిగాయి. టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులపై భారం పడుతుందని వివరించారు. అలా గే టీటీడీ స్వత్రంతను దెబ్బతీసే విధంగా ఉందని.. ఈ మేరకు ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు.

ఇక ఇరువర్గాల వాదోపవాదనలు విన్న కోర్టు పిటిషనర్ల తరపు వాదనలను ఏకీభవిస్తూ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టింది. అలాగే టీటీడీ బోర్డు నిర్ణయంపై సీరియస్ అయింది. దీనితో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..

Related posts