telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు…

Nimmagadda ramesh

పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.  తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల లోని 14 వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసి అవకాశం కల్పించింది.  అయితే, దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది.  దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్ఈసి ఆదేశాలను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశించింది.  ఇక వాలంటీర్లపై కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది.  వాలంటీర్ల నుంచి ఫోనులు స్వాధీనం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 140 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ.. రీ-నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వివిధ కారణాలతో నాలుగు నగరపాలక సంస్థలు, 29 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించడంలేదు.

Related posts