telugu navyamedia
andhra crime culture news

ఆసుపత్రి నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్

Dr Sudhakar

విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డిశ్చార్జ్ అయ్యారు. కోర్టు ఆదేశించిన తర్వాత తనను డిశ్చార్జ్ చేయాలంటూ డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించిన తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆయనను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ పోలీసు కస్టడీలో లేరని, మెరుగైన వైద్యం కోసం విశాఖ మానసిక వైద్యశాలకు తరలించినట్టు తెలిపారు. ఆయన డిశ్చార్జ్ కావాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు, సీబీఐ కూడా సుధాకర్ తమ కస్టడీలో లేరని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించింది.

Related posts

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

vimala p

‘మిస్టర్ మజ్ను’ టీజర్…

vimala p

ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు: భట్టి

vimala p