telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం

AP High Court Building started CJI Gogai

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ) గొగోయ్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. సీఆర్‌డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవనంలో జ్యుడిషియల్ కాంప్లెక్స్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. 14.2 ఎకరాల్లో రూ.173 కోట్లతో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టూ పద్ధతిలో నిర్మించారు.

23 కోర్టు హాళ్లు, అనుబంధ కార్యాలయాలు ఉన్నాయి. ఏజీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదుల అసోసియేషన్ హాళ్ల నిర్మాణం చేశారు. మహిళలకు ప్రత్యేకంగా అసోసియేషన్ హాల్‌ను నిర్మించారు. అడ్వకేట్ చాంబర్, వివాద పరిష్కార కేంద్రాలు, లైబ్రరీ సదుపాయం కల్పించారు. ప్రధాన ద్వారం పైభాగంలో మూడు సింహాల బొమ్మ ఏర్పాటు చేశారు.

Related posts