telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు: హైకోర్టు

ap high court

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు భావించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు.

Related posts