telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మద్యం దుకాణాల్లో అమ్మకాల కోసం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

బెల్టు షాపులను ఎత్తివేసిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం షాపులను తామే నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 10 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Related posts