telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరం రివర్స్ టెండరింగ్ పై … ఏపీ ప్రభుత్వ స్పష్టత…

Polavaram-Project

నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం, ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై స్పందించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడింది. రివర్స్ టెండరింగ్ తో ఎంత ఖర్చు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని, కాంట్రాక్టు ఏజెన్సీల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది.

పోలవరంపై సమగ్ర నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. తుదినిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఈ అంశాలన్నీ పరిగణించాలని, టెండర్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదన్నదే తమ అభిప్రాయమని అథారిటీ పేర్కొంది.

Related posts