telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ పై దాడి కేసు.. ఎన్.ఐ.ఏ కు సహకరించం.. ఏపీ ప్రభుత్వం..

Chandrababu comments Jagan cases

జగన్ పై హత్యాయత్నం గురించి మరో రాజకీయం జరుగుతుంది. తాజాగా ఈ కేసును ఎన్.ఐ.ఏ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రచారం కోసమే అంటూ లడ్డా ఈ కేసు గురించి స్పష్టత కూడా ఇచ్చేశారు. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం ఏవేవో సాకులు చెప్తూ, ఎన్.ఐ.ఏ కు సహకరించమని చెపుతుండటం మరో వివాదానికి తెరలేపుతుంది. తాజాగా, ఈ కేసులో నేడు మరో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు ఈరోజు ఉదయం విశాఖపట్నంకు చేరుకున్నారు. కేసు వివరాలను తమకు అప్పగించాలని కోరారు. అయితే ఇందుకు విశాఖ పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

జగన్ పై గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. జగన్ ను చంపాలనే ఈ దాడిచేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శాంతిభద్రతలు, రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కేంద్రం చర్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ముఖ్యనేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై మరోసారి వైసీపీ కోర్టు మెట్లు ఎక్కనుందా, ఎన్.ఐ.ఏ చేసుకుంటుందా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

Related posts