telugu navyamedia
andhra political

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త 

ap logo
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యువ నేస్తం పధకం కింద 4 లక్షలకు పైగా అర్హులకు ప్రతీ నెల రూ.1000 భృతి ఇస్తున్నామని స్పష్టం చేశారు. దాదాపు ఈ పధకానికి 10 లక్షల 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 
నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఇష్టం ఉన్న వాటిలోనే కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Related posts

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

vimala p

ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు

vimala p

రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు … సాధిస్తాం… : కేటీఆర్

vimala p