telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో .. జరిమానాల మోత సవరణలు ..

AP

రాష్ట్ర ప్రభుత్వం కూడా వాహనదారులకు జరిమానాల భాదను తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం లేదని సమాచారం. కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి మొదట ప్రజల్లో అవగాహనా తీసుకురావాలని, ఆతర్వాత ఇలాంటి భారీ జరిమానాలు విధించాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుందట.

ఇప్పుడు ఉన్న భారీ ఫైన్లపై ఒకసారి అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారాలను జగన్ ఆదేశించారని సమాచారం. జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా అధికారుల కమిటీ జరిమానాల నివేదికను పంపారట. ఆ జరిమానా నివేదిక ఇదే… రోడ్డు నిబంధన అతిక్రమిస్తే – కేంద్రం రూ.500 (జగన్ ప్రభుత్వం రూ.250); లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.2500); అర్హత లేకుండా వాహనం నడిపితే -కేంద్రం రూ.10,000 (జగన్ ప్రభుత్వం రూ.4000); ఓవర్ సైజ్డ్ వాహనాలు – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.1000); డేంజరస్ డ్రైవింగ్ – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.2500); డ్రంక్ అండ్ డ్రైవ్ – కేంద్రం రూ.10,000 (జగన్ ప్రభుత్వం రూ.5000); సీట్ బెల్ట్ – కేంద్రం రూ.1000 (జగన్ ప్రభుత్వం రూ.500); ఇన్సూరెన్స్ లేకుంటే – కేంద్రం రూ.2000 (జగన్ ప్రభుత్వం రూ.1250).

Related posts