telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు వార్తలు

నష్ట నివారణకు 6386.67 కోట్లు అవసరమవుతాయి …

cm jagan ycp

కేంద్ర బృందాలు ఈరోజు రేపు అంటే రెండురోజుల పాటు వరద  నష్టాన్ని అంచనా వేయడానికి వరద ప్రభావిత జిల్లాలో పర్యటించనున్నాయి. ఈరోజు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూడు బృందాలు పర్యటించనున్నాయి. రేపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఇక పర్యటనకు వెళ్ళే ముందు సీఎస్ నీలం సాహ్నీతో కేంద్ర బృందాలు భేటీ అయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు సంభవించిన నష్టాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సహా సంబంధిత శాఖల అధికారులతో చర్చించాయి సెంట్రల్ టీమ్స్. వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం వివరాలను సేకరించాయి కేంద్ర బృందాలు. వివిధ శాఖల వారీగా జరిగిన నష్టంపై ఆయా శాఖల వారీగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించాయి కేంద్ర బృందాలు. వివిధ శాఖల్లో నష్ట నివారణకు సుమారు రూ. 6386.67 కోట్ల మేర అవసరమవుతాయని కేంద్ర బృందానికి వివరించింది రాష్ట్ర ప్రభుత్వం. అకాల వర్షాల కారణంగా 186 మండలాల్లో వరద ప్రభావం ఉందంటోంది ప్రభుత్వం. దాదాపు 885 గ్రామాలు నీటమునిగినట్లు తేలింది. 35 వేల ఇళ్లు మునిగిపోగా… 1700కి పైగా ధ్వంసం అయ్యాయి. సుమారు 15 వందల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు అంచనా వేశారు.

Related posts