telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌ !

ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌ తగిలింది. బయోమెట్రిక్‌ హాజరుపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్‌ చేయకపోతే ఆ రోజుకు జీతం పడదని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్‌ అములులోకి వస్తుందని తెలిపింది ప్రభుత్వం. పంచ్‌ పనిచేయడం లేదని, ఆన్‌ డ్యూటీ అంటూ ఉద్యోగులు బయోమెట్రిక్‌ నుంచి తప్పించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సాయంత్రం 3 నుంచి 5 వరకు సచివాలయంలోనే ఉండాలని, స్పందన కార్యక్రమం నిర్వహించి స్వీకరించాలని పేర్కొంది ఏపీ సర్కారు. రేషన్‌కార్డు, పింఛన్‌, ఆరోగ్య శ్రీ కార్డు లాంటి వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలనే ఆదేశాలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని కచ్చితంగా అమలు చేయాలని, అలా చేయని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది ప్రభుత్వం.

Related posts